![]() |
![]() |

గతేడాది నువ్వా నేనా అన్నట్టుగా సాగిన 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'(మా) ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. అయితే ఎన్నికల సమయంలో మంచు కుటుంబం వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు తమపై నోరు పారేసుకున్నారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ కి చెందిన కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు బెనర్జీ అయితే మోహన్ బాబు తనని దారుణంగా తిట్టారంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఈ వివాదంపై తాజాగా మరోసారి స్పందించారు బెనర్జీ.
తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మోహన్ బాబుతో ఎంతో సన్నిహితంగా ఉండే తాను, మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో బెనర్జీ తెలిపారు. "ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే ప్రకాష్ రాజ్ ఏడాది ముందే మా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. అప్పుడు మోహన్ బాబుకి కూడా చెప్పారు. కానీ తర్వాత ఏమైందో ఏంటో మోహన్ బాబు విష్ణుని తీసుకొచ్చారు. దాంతో ఇప్పుడు ప్రకాష్ రాజ్ కి అవకాశమిచ్చి, రెండేళ్ల తర్వాత విష్ణుకి అవకాశం ఇద్దామని చిరంజీవి అన్నారు. అయినా వినలేదు. అందుకే మోహన్ బాబు అడిగినా నేను విష్ణుకి మద్దతు ఇవ్వలేదు. దాంతో ఎన్నికల సమయంలో మోహన్ బాబు నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టారు. చాలా హర్ట్ అయ్యాను" అని బెనర్జీ చెప్పుకొచ్చారు.
![]() |
![]() |