![]() |
![]() |

ఆది సాయికుమార్ సరసన 'ప్రేమ కావాలి' (2011) సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, తన గ్లామర్‌తో ఆడియెన్స్‌ను అలరించింది ఇషా చావ్లా. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ నిర్మించగా, కె. విజయభాస్కర్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కూడా అయ్యింది. ఆ తర్వాత అదే సంస్థం నిర్మించిన 'పూలరంగడు' (2012) మూవీలో సునీల్ జోడీగా నటించింది. అందులో గ్లామర్ పండించడమే కాకుండా, పర్ఫార్మెన్స్ పరంగానూ మంచి మార్కులు తెచ్చుకుంది. పైగా తొలి సినిమాని మించి పూలరంగడు ఘన విజయం సాధించింది. దాంతో సెంటిమెంట్‌గా భావించిన ఆ సంస్థ ఆ వెంటనే మరో సినిమాలోనూ కూడా ఆమెను హీరోయిన్‌గా తీసుకుంది. అది కూడా.. బాలకృష్ణ హీరోగా నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రంలో. ఇందులో పార్వతీ మెల్టన్ మరో హీరోయిన్‌గా నటించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు సినిమాలు ఒకే బ్యానర్‌లో హీరోయిన్‌గా నటించి, వార్తల్లో నిలిచింది ఇషా.
కానీ ఆ తర్వాత అనూహ్యంగా కెరీర్‌లో వెనకపడి పోయింది. 'తను వెడ్స్ మను' తెలుగు రీమేక్ 'మిస్టర్ పెళ్లికొడుకు' (2013)లో మరోసారి సునీల్ సరసన నటించింది కానీ, ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ తర్వాత అల్లరి నరేశ్ జోడీగా 'జంప్ జిలానీ' (2014)లో కనిపించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో, మళ్లీ తెలుగులో ఆమెకు చాన్స్‌లు లభించలేదు. ఏ హీరో కూడా ఆమెను రికమెండ్ చేయకపోవడంతో టాలీవుడ్‌లో తలుపులు మూసుకుపోయినట్లయింది.
ఆ తర్వాత కన్నడంలో 'విరాట్' (2016) అనే సినిమా చేసినా అది ఆమె కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆపైన కొన్ని ఫొటో షూట్‌లో చేసి, మీడియాకు ఆ ఫొటోలు రిలీజ్ చేసింది ఇషా. అయినా ఆమెను పట్టించుకున్న వాళ్లు లేరు. గత ఏడాది కొవిడ్-19 బారినపడి కోలుకుని, ఆ సందర్భంగానూ వార్తలకెక్కింది. ఆ టైమ్‌లోనే బిగ్ బాస్ తెలుగు షోలో కంటెస్టెంట్‌గా వెళ్లనుందని కూడా ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవ రూపం దాల్చలేదు. ఆ తర్వాత కూడా ఆమెకు చాన్స్‌లు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఎవరైనా తనకు మంచి వేషాలు ఇస్తారేమోనని కొండంత ఆశతో ఎదురుచూస్తోంది ఈ ఢిల్లీ అమ్మాయి.

![]() |
![]() |