![]() |
![]() |

నందమూరి కళ్యాణ్ రామ్ మళ్ళీ తన సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. హీరోగా, ప్రొడ్యూసర్ గా ఫ్లాప్స్ వస్తున్నాయని అస్సలు భయపడకుండా ఇంకా మున్ముందుకు వెళ్తున్నాడు. డెవిల్ మూవీ షూటింగ్ ఆల్రెడీ మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది. కానీ ఆ విషయాలేవీ మీడియాకు వెల్లడించలేదు. ఐతే డెవిల్ గురుంచి ఎలాంటి విషయాలు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు మూవీ టీమ్. పబ్లిసిటీ లేకపోతె ఎలాంటి మూవీ కూడా వసూళ్లు రాబట్టవని తెలుసుకున్న కళ్యాణ్ రామ్ కొత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ముందుగానే పబ్లిసిటీ చేసి తర్వాత డిజాస్టర్ వస్తే కొంచెం తట్టుకోవడం కష్టం. అందుకే అప్పుడప్పుడు ఒక్కో గెట్ అప్ కి సంబందించిన లుక్స్ ని విడుదల చేస్తూ జనాల్లో ఆసక్తిని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అభిమానులు కూడా అసలు ఈ మూవీలో కళ్యాణ్ ఎలా ఉండబోతున్నాడు అంటూ ఊహించుకుంటున్నారు.
ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో కంటే కూడా ఇప్పుడు తన స్టైల్ మొత్తాన్ని మార్చుకున్నాడు కళ్యాణ్ . కొత్త స్టోరీ లైన్ దొరికితే చాలు దాన్ని వదులుకోకుండా హిట్టా ఫ్లాపా అని చూడకుండా మూవీస్ చేస్తూ వెళ్తున్నాడు. ఆగష్టులో విడుదల కాబోయే బింబిసారా మూవీ విషయంలో కూడా కళ్యాణ్ రామ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎలాంటి న్యూస్ బయటికి లీక్ కాకుండా చూసుకున్నాడు. పబ్లిసిటీ విషయంలో కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్న కళ్యాణ్ కి మరి ఈ మూవీస్ మంచి కలెక్షన్స్ తెచ్చిపెడతాయా లేదా అనే విషయాలు తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాలి.
![]() |
![]() |