![]() |
![]() |

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ - భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను రంజింపజేశాయి. వాటిలో `మురళీ కృష్ణుడు` ఒకటి. కింగ్ నాగార్జున టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో అతనికి జోడీగా కృష్ణవేణి పాత్రలో రజిని సందడి చేసింది. మోహన్ బాబు, గొల్లపూడి మారుతి రావు, షావుకారు జానకి, రావికొండల రావు, గోకిన రామారావు, చిట్టిబాబు, చంద్రిక, అనిత, వై.విజయ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కుయిలీ ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది. ఈ చిత్రానికి భార్గవ్ ఆర్ట్స్ యూనిట్ కథను అందించగా కోడి రామకృష్ణ స్క్రీన్ ప్లే, గణేశ్ పాత్రో సంభాషణలు సమకూర్చారు.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రానికి సి. నారాయణ రెడ్డి, వెన్నెలకంటి సాహిత్యమందించారు. ``నా కోసమే లోకం``, ``చక్కని చిలకమ్మ``, ``నీ అభినయ గతిలోన``, ``ఎట్టాగో``, ``ఓలోలే నవ్వింది``, ``ప్రేమంటే మోసమని`` అంటూ మొదలయ్యే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. 1988 జూన్ 3న విడుదలై జననీరాజనాలు అందుకున్న `మురళీ కృష్ణుడు`.. నేటితో 34 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |