Home

»

Latest News

స‌త్య‌దేవ్.. జూన్ డ‌బుల్ ధ‌మాకా!

Jun 3, 2022 4:52PM

వైవిధ్య‌భ‌రితమైన‌ అభిన‌యంతో, డైలాగ్ డెలివ‌రీతో న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు స‌త్య‌దేవ్. ఒక‌వైపు క‌థానాయ‌కుడిగా అల‌రిస్తూనే.. మ‌రోవైపు ముఖ్య పాత్ర‌ల్లోనూ మురిపిస్తున్నాడు ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్. ఇప్ప‌టికే `జ్యోతి ల‌క్ష్మి`, `బ్లఫ్ మాస్ట‌ర్`,  `బ్రోచేవారెవ‌రురా`, `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య‌`, `తిమ్మ‌రుసు` చిత్రాల‌తో క‌థానాయ‌కుడిగా ఆక‌ట్టుకున్న స‌త్య‌దేవ్.. ఈ జూన్ నెల‌లో రెండు ఆస‌క్తిక‌ర‌మైన సినిమాల‌తో ఎంట‌ర్టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `బ్ల‌ఫ్ మాస్ట‌ర్` త‌రువాత గోపీ గ‌ణేశ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన సినిమా `గాడ్సే`. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సినిమాలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి క‌థానాయిక‌గా న‌టించ‌గా.. బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ళ భ‌ర‌ణి, నాగ‌బాబు, సిజ్జు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. సునీల్ క‌శ్య‌ప్ సంగీత‌మందించిన ఈ చిత్రం.. జూన్ 17న రిలీజ్ కానుంది. కాగా, ఇదే నెల‌లో త‌మ‌న్నాతో క‌లిసి స‌త్య‌దేవ్ న‌టించిన `గుర్తుందా శీతాకాలం` విడుద‌ల కానుంది. క‌న్న‌డ చిత్రం `ల‌వ్ మాక్ టైల్`(2020) ఆధారంగా తెర‌కెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాని నాగ‌శేఖ‌ర్ రూపొందించాడు. మ‌రి.. జూన్ నెల‌లో త‌క్కువ గ్యాప్ లోనే రానున్న ఈ రెండు చిత్రాల‌తో క‌థానాయ‌కుడిగా స‌త్య‌దేవ్ ఎలాంటి ఫ‌లితాల‌ను పొందుతాడో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com