![]() |
![]() |

మూవీ చూడడానికి థియేటర్ కి వెళ్ళినప్పుడు తెర మీద ఫస్ట్ వచ్చేది "ఈ నగరానికి ఏమయ్యింది..ఒక వైపు దుమ్ము..మరో వైపు పొగ " అనే యాడ్ కనిపిస్తుంది.. ఐతే ఇదే టైటిల్ తో తరుణ్ భాస్కర్ 2018 లో ఒక మూవీ తీశారు. అనుకున్నంత హిట్ టాక్ రాకపోయినా ఇది జనాల్లోకి వెళ్ళింది. స్లోగా ఒక హైప్ క్రియేట్ అయ్యింది. ఇదొక నలుగురి కుర్రాళ్ల కథ. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా తరుణ్ భాస్కర్ క్రియేటివిటీ గురుంచి ప్రేక్షకులు చర్చించుకున్నారు. ఐతే ముందు పెళ్లిచూపులు మూవీకి డైరెక్టర్ గా మారి సక్సెస్ అందుకున్నాకా ఈ నగరానికి ..మూవీ తీసాడు.
ఐతే ఇప్పుడు దానికి సీక్వెల్ ని ప్లాన్ చేయబోతున్నట్లు అలీతో సరదాగా షోలో తన మనసులో మాటను బయటపెట్టాడు తరుణ్. ఎందుకంటే విశ్వక్ ఈ షో కోసం ఒక వీడియొ పంపి పార్ట్ - 2 ఎప్పుడు తీస్తున్నారని విషయాన్ని అలీ చేత అడిగించాడు. దాంతో తరుణ్ కూడా 2024 లో పక్కా ..డేట్స్ బ్లాక్ చేసి పెట్టుకో. ఆ టైం వచ్చేసరికి పాన్ ఇండియా మూవీలో ఉన్నాను అంటే మాత్రం నేను ఊరుకోను అంటూ విశ్వక్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు తరుణ్. ఫస్ట్ పార్ట్ లో నలుగురి కుర్రాళ్లలో విశ్వక్ కూడా ఒక పాత్ర చేసాడు. ఈ మూవీ ద్వారానే విశ్వక్ బిగ్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. అలా ఒక అందమైన ఫ్రెండ్ షిప్ ని నలుగురు కుర్రాళ్లతో తీసి మరింత అందాన్ని తెచ్చాడు తరుణ్. ఐతే దీని సీక్వెల్ లో ఎవరెవరు ఉండబోతున్నారు. దాని స్టోరీ లైన్ ఏమిటి ? అనే విషయాలు త్వరలో ప్రకటించనున్నాడట తరుణ్ భాస్కర్..
![]() |
![]() |