![]() |
![]() |

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సురేందర్ రెడ్డి ఒకరు. ఇప్పటిదాకా ఏడుగురు హీరోలతో పని చేసిన ఆయన ఐదుగురు హీరోలకు హిట్స్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అతనొక్కడే'(2005) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని ఆ తర్వాత వరుసగా స్టార్స్ తో సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన అక్కినేని యువ హీరో అఖిల్ తో 'ఏజెంట్' సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాని ఒక పాజిటివ్, ఒక నెగటివ్ సెంటిమెంట్ వెంటాడుతున్నాయి.
'అతనొక్కడే' సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో మూడోది. అదే కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొదటి హిట్, పెద్ద హిట్ కావడం విశేషం. 'అతనొక్కడే' సినిమానే కళ్యాణ్ రామ్ ని హీరోగా నిలబెట్టింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి చేసిన సినిమాలన్నీ స్టార్స్ తోనే. ఎన్టీఆర్ తో చేసిన 'అశోక్', 'ఊసరవెల్లి', మహేష్ బాబుతో చేసిన 'అతిథి' నిరాశపరిచాయి. రవితేజ తో చేసిన 'కిక్' సంచలన విజయాన్ని అందుకోగా.. 'కిక్-2' మాత్రం ప్లాప్ గా నిలిచింది. అల్లు అర్జున్ తో చేసిన 'రేసు గుర్రం', రామ్ చరణ్ తో చేసిన 'ధృవ', చిరంజీవితో చేసిన 'సైరా నరసింహారెడ్డి' విజయాలను అందుకున్నాయి. తారక్, మహేష్ మినహా పని చేసిన అందరితో విజయాలు అందుకున్న సురేందర్ రెడ్డి.. చాలా ఏళ్ళ తర్వాత యువ హీరోతో ఓ సినిమా చేస్తున్నాడు. అదే 'ఏజెంట్'. గత చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తో మొదటి హిట్ అందుకొని ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న అఖిల్ కి ఇది ఐదో సినిమా. మరి అప్పుడప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సురేందర్ రెడ్డి ఇప్పుడు అఖిల్ కి కూడా ఆ రేంజ్ సక్సెస్ ఇస్తారేమో చూడాలి.
సురేందర్ రెడ్డి కెరీర్ లో దారుణంగా నిరాశపరిచిన సినిమా 'కిక్-2'. 'అశోక్', 'ఊసరవెల్లి', 'అతిథి' సినిమాలు పరాజయం పాలైనప్పటకీ అంతో ఇంతో పర్లేదు అనిపించుకున్నాయి. కానీ 'కిక్-2' మాత్రం భారీ ప్లాప్ గా నిలిచి ఏ వర్గాన్ని ఆకట్టుకోలేకపోయింది. ఇపుడు ఈ సినిమా నెగటివ్ సెంటిమెంట్ ఏజెంట్ ని వెంటాడుతుంది. ఇప్పటిదాకా సురేందర్ రెడ్డి కెరీర్ లో కిక్-2 మాత్రమే ఆగష్టు నెలలో విడుదలైంది. ఇప్పుడు ఏజెంట్ కూడా ఆగష్టు నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తనకి కలిసిరాని ఆగష్టు నెలలో ఏజెంట్ తో వస్తున్న సురేందర్ రెడ్డి ఎలాంటి రిజల్ట్ చూస్తాడో!.
![]() |
![]() |