Home

»

Latest News

త్రివిక్రమ్ `అ ఆ`కి ఆరేళ్ళు!

Jun 2, 2022 1:32PM

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ చాలా వ‌ర‌కు కుటుంబ స‌మేతంగా చూడ‌దగ్గ చిత్రాల‌నే తెర‌కెక్కిస్తూ వ‌స్తున్నారు. యూత్ స్టార్ నితిన్, చెన్నై పొన్ను స‌మంత జంట‌గా ఆయ‌న‌ రూపొందించిన `అ ఆ` కూడా అచ్చంగా ఆ త‌ర‌హా సినిమానే. త‌న అభిమాన ర‌చ‌యిత్రి య‌ద్ద‌న‌పూడి సులోచ‌నా రాణి ర‌చించిన ప్ర‌సిద్ధ న‌వ‌ల `మీనా` ఆధారంగా త్రివిక్ర‌మ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇక‌  ఈ సినిమాతోనే కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలుగునాట తొలి అడుగేయ‌గా.. న‌దియా, న‌రేశ్, అన‌న్య‌, రావు ర‌మేశ్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, ఈశ్వ‌రీ రావు, హ‌రితేజ‌, అజ‌య్, జ‌య‌ప్ర‌కాశ్, పోసాని కృష్ణ‌ముర‌ళి, గిరిబాబు, ర‌ఘుబాబు, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్, చ‌మ్మ‌క్ చంద్ర‌, అన్న‌పూర్ణ‌, ర‌జిత, క‌రాటే క‌ళ్యాణి, శివ‌న్నారాయ‌ణ‌ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

మిక్కీ జే మేయ‌ర్ బాణీల‌కు అనుగుణంగా రామ‌జోగ‌య్య శాస్త్రి, కృష్ణ చైత‌న్య ఇందులోని పాట‌ల‌కు సాహిత్య‌మందించారు.   ``ఎల్లిపోకే శ్యామ‌ల‌``, ``రంగ్ దే``, ``యా యా``, ``అన‌సూయ కోసం``, ``మమ్మీ రిట‌ర్న్స్`` అంటూ మొద‌ల‌య్యే గీతాల‌న్ని ఆక‌ట్టుకున్నాయి.  హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్. రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మించిన `అ ఆ`.. 2016 జూన్ 2న విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. కాగా, నేటితో ఈ చిత్రం ఆరు వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com