![]() |
![]() |

'F3'లో వెంకటేష్ చేసిన సందడి అంతాఇంతా కాదు. ముఖ్యంగా 'కుర్రాడు బాబోయ్' సాంగ్ రీమిక్స్ కి ఆయన వేసిన మాస్ స్టెప్పులు అలరించాయి. ఈ సాంగ్ కి థియేటర్స్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తన సాంగ్ కి వెంకటేష్ చిందేశాడని తెలిసి, సుమన్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ సాంగ్ పెట్టిన సందర్భం తెలిస్తే సుమన్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
'కుర్రాడు బాబోయ్' సాంగ్ సుమన్ హీరోగా నటించిన 'చిన్న అల్లుడు'(1993) సినిమాలోనిది. అప్పట్లో ఈ సాంగ్ ఒక ఊపు ఊపింది. ఈ జెనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియని ఈ సాంగ్ ఇప్పుడు 'F3' మూలంగా అందరికీ తెలుస్తోంది. మరోవైపు తన సాంగ్ F3 మూవీలో ఉపయోగించారని తెలిసి సుమన్ కూడా ఆనందపడ్డారు. తన పాటను వెంకటేష్ ఆయన సినిమాలో పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉందని, తనకు మళ్లీ పాత జ్ఞపకాలు గుర్తుచేశారని సుమన్ అన్నారు. తాను ఈ సినిమాను ఇంకా చూడలేదని, అందరూ తన సాంగ్ F3 లో ఉందని చెప్పడంతో ఫస్ట్ షాక్ అయ్యాయని సుమన్ చెప్పారు.
సుమన్ ఇంకా F3 చూడలేదు కాబట్టి, ఆ సినిమాలో తన పాట పెట్టారని హ్యాపీగా ఫీలయ్యారు. కానీ సినిమా చూస్తే మాత్రం సుమన్ హర్ట్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే F3 లో ఆ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ దారుణంగా ఉంటుంది. దానిని రికార్డింగ్ డ్యాన్స్ లా చూపించారు. కొందరు భామలతో కలిసి వెంకటేష్ చిందేస్తాడు. అంతేకాదు ఆ సాంగ్ విని ఇర్రిటేట్ అయిన మురళి శర్మ ఆపేయమని అరుస్తాడు. ఇది ఒక రకంగా సాంగ్ ని అవమానించడం లాంటిదే. మరి సినిమాలో తన సాంగ్ పెట్టారని సంబరపడుతున్న సుమన్.. తన సాంగ్ ని అవమానించిన తీరు చూశాక ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
![]() |
![]() |