![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం చరణ్ కి జోడీగా నటించడానికి బాలీవుడ్ బ్యూటీలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ అయితే చరణ్ తో డేటింగ్ కి వెళ్లాలనుంది అంటూ తాజాగా హాట్ కామెంట్స్ చేసింది.
2017లో మిస్ ఇండియాగా, మిస్ వరల్డ్ గా ఎంపికైన మానుషి చిల్లర్ బాలీవుడ్ మూవీ 'సామ్రాట్ పృథ్వీరాజ్'తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా రేపు(జూన్ 3) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది మానుషి.
ఓ ఇంటర్వ్యూలో 'డేట్‌కు వెళ్లాలంటే ఎవరితో వెళ్తారు?' అనే ప్రశ్న ఎదురు కాగా.. రామ్ చరణ్ తో డేటింగ్ కు వెళ్తాను అంటూ మానుషి సమాధానం చెప్పింది. చరణ్ తో కలిసి నటించాలని ఉందని, అలాగే ఆయనకు ఆయనకు పెళ్లికాకుంటే డేట్ కి వెళ్లేదాన్ని అంటూ కామెంట్స్ చేసింది. మాజీ మిస్ వరల్డ్ తమ హీరో గురించి పాజిటివ్ కామెంట్స్ చేయడంతో చరణ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
![]() |
![]() |