![]() |
![]() |

మంచు విష్ణు తన కొత్త సినిమాలో 'గాలి నాగేశ్వరరావు' అనే పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి టైటిల్ కూడా 'గాలి నాగేశ్వరరావు' పెట్టనున్నారని టాక్. అయితే ఆ పేరుకి తగ్గట్లే సెట్ లో అల్లరి చేస్తున్నాడు విష్ణు.
ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి విష్ణు, సన్నీ చేస్తున్న సరదా వీడియోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ప్రాంక్, కుకింగ్ వీడియోలతో నవ్వులు పూయించిన ఈ జోడీ.. ఇప్పుడు ముద్దు పెట్టుకుంటున్నట్లు ఫోటోకి పోజ్ ఇచ్చారు. తాజాగా 'గాలి నాగేశ్వరరావు' టీమ్ ఓ రెస్టారెంట్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా విష్ణు, సన్నీతో కలిసి పాయల్ సెల్ఫీ దిగగా.. అందులో సన్నీకి ముద్దు పెట్టబోతున్నట్లుగా విష్ణు పోజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి సరదా ఫోటోలు, వీడియోలతో విష్ణు తన సినిమాని బాగానే ప్రమోట్ చేస్తున్నాడు.

అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు. చో టా.కె.నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.
![]() |
![]() |