![]() |
![]() |

పోలీస్ పాత్ర అంటే చాలు ఇప్పటికీ గుర్తొచ్చే మూవీ అంకుశం. అప్పట్లో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇందులో హీరోగా రాజశేఖర్ నటించారు. విలన్ గా రామిరెడ్డి నటించారు. జీవిత హీరోయిన్ గా యాక్ట్ చేశారు. సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో 1990 లో ఈ మూవీ వచ్చింది. రాజశేఖర్ పాత్రకు గాత్ర దానం చేసారు సాయికుమార్. ఈ మూవీని ఇతర భాషల్లోకి కూడా డబ్ చేశారు. అక్కడ కూడా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్స్ కొట్టింది. ఈ చిత్రంలోని రాజశేఖర్ నటనకు యాంగ్రీ యంగ్ మెన్ గా పేరు తెచ్చుకున్నారు.
ఈ మూవీ లో డైలాగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన రామిరెడ్డికి ఈ చిత్రం పేరే ఇంటి పేరుగా స్థిరపడింది. అంకుశం రామిరెడ్డి అని ఇండస్ట్రీలో అందరూ పిలవడం స్టార్ట్ చేశారు. రామిరెడ్డి ఈ మూవీలో విల్లన్ పాత్రకు నంది అవార్డు అందుకున్నారు. ఈ మూవీ చూసి ఎంతో మంది యూత్ అప్పట్లో ఫైట్స్ కూడా చేసారంటే అతిశయోక్తి కాదు. చలన చిత్రాలు ప్రేక్షకుల మీద అంత ప్రభావం చూపిస్తాయి మరి. ఇదే స్టోరీ లైన్ తో "ప్రతిబంద్" అనే టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక మూవీ చేశారు. ఈ చిత్రంతో ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత తమిళ్ లో "ఇదుదాండ పోలీస్" పేరుతో అనువాదమై విజయం సాధించింది.
ఈ మూవీలోని సాంగ్ "ఇది చెరగని ప్రేమకు శ్రీకారం" ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. పోలీస్ కేరెక్టర్ కి ఈ మూవీలో రాజశేఖర్ రోల్ ఒక ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పొచ్చు. ఈ మూవీ తర్వాత కొంతకాలానికి రాజశేఖర్, జీవిత పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఈ మూవీ చూసి చాలామంది ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఈ అంకుశం మూవీ రిలీజై 33 వసంతాలు.
![]() |
![]() |