![]() |
![]() |

`ఉప్పెన`, `శ్యామ్ సింగ రాయ్`, `బంగార్రాజు` చిత్రాలతో తెలుగునాట హ్యాట్రిక్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `ద వారియర్`, `మాచర్ల నియోజక వర్గం` వంటి తెలుగు సినిమాలున్నాయి. కాగా, ఈ చిత్రాలన్నీ వరుసగా మూడు నెలల పాటు జనం ముందుకు రాబోతున్నాయని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబుకి జోడీగా కృతి శెట్టి నటించిన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని బజ్. ఇక `ద వారియర్` విషయానికి వస్తే.. రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి నిర్దేశకత్వంలో తయారవుతున్న ఈ బైలింగ్వల్ మూవీ జూలై 14న జనం ముందుకు రానుంది. అలాగే నితిన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి తీర్చిదిద్దుతున్న `మాచర్ల నియోజక వర్గం` ఆగస్టు 12న తెరపైకి వస్తోంది. అంటే.. జూన్, జూలై, ఆగస్టు ఇలా వరుసగా మూడు నెలల పాటు నెలకో సినిమాతో కృతి శెట్టి టాలీవుడ్ లో సందడి చేసే అవకాశముందన్నమాట. మరి.. ఈ చిత్ర త్రయాలతో కృతి ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
![]() |
![]() |