![]() |
![]() |

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జన్మదినం మే23. ఈ సోమవారంతో ఆయన 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. ఈ అనుభవంతో 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను లేఖ రాశారు రాఘవేంద్రరావు.

"దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదటిరోజున 'పాండవ వనవాసం' చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్‌పై తొలిసారి క్లాప్ కొట్టటంతో నా కెరీర్ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు నాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లపాటు అసిస్టెంట్ గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కె.యస్ ప్రకాశ్‌రావుగారు అందించిన 'బాబు' (1975) చిత్రంతో దర్శకునిగా సినిమా ప్రయాణం. ఆ రోజు నుండి మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు, ఆనందాలు, ఎత్తులు, లోతులు అవార్డులు, రివార్డులు ఎన్నిచూసుంటాను. 48 ఏళ్ల దర్శకత్వ సుదీర్ఘ ప్రయాణం గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి. అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో 'నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ' అంటూ నా స్వహస్తాలతో నేను ఓ పుస్తకం రాసుకున్నాను. ఆ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లతో పాటు , రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను. అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ (నా) ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతన్నాను. నా ఈ స్థితికి కారణమైన 24 శాఖలవారికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి, నేను నేర్చుకున్న పాఠాల గురించి మనసు పెన్‌తో రాశాను, ఓపెన్‌గా రాశాను. ఏది కప్పి చెప్పలేదు, విప్పి చెప్పలేదు. దొరుకుతుంది. పాఠలకులందరూ పుస్తకాన్ని చదివి ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ తన బుక్ గురించి చెప్పుకొచ్చారు కె.రాఘవేంద్రరావు.
![]() |
![]() |