![]() |
![]() |

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కథానాయికల్లో స్టార్ బ్యూటీ సమంత ఒకరు. రైట్ నౌ సామ్ ఖాతాలో `శాకుంతలం`, `యశోద`, `ఖుషి` వంటి తెలుగు చిత్రాలున్నాయి. ఇవన్నీ కూడా ఇతర భాషల్లోనూ సందడి చేయనున్నాయి. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ గా రూపొందుతున్న `శాకుంతలం`, `యశోద` పాన్ - ఇండియా ప్రాజెక్ట్స్ గా ఎంటర్టైన్ చేయనుండగా.. విజయ్ దేవరకొండతో సామ్ కలిసి నటిస్తున్న రొమాంటిక్ మూవీ `ఖుషి` దక్షిణాది భాషలన్నింటిలోనూ అలరించనుంది.
ఇదిలా ఉంటే, ఇప్పటికే `యశోద` చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించగా.. `ఖుషి`ని క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో.. `శాకుంతలం` ఆగమనంపై ఆసక్తి నెలకొని ఉంది. `యశోద`, `ఖుషి` కంటే ముందే పట్టాలెక్కిన `శాకుంతలం`ని దసరా స్పెషల్ గా రిలీజ్ చేయాలని గుణశేఖర్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందట. త్వరలోనే `శాకుంతలం` రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రాబోతున్న `యశోద`, `శాకుంతలం`, `ఖుషి`తో సామ్ ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
![]() |
![]() |