![]() |
![]() |

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సౌత్ నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒకే తేదీకి మూడు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధమవ్వడం విశేషం.
సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ 'యశోద' ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఏజెంట్' సినిమా కూడా ఆగష్టు 12న విడుదల కానుంది. ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే తేదీకి రావడానికి మరో పాన్ ఇండియా మూవీ సిద్ధమైంది.
కోలీవుడ్ హీరో విశాల్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'లాఠీ'. రానా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వినోద్ కుమార్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని ఆగష్టు 12 న విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో ముఖం నిండా నెత్తుటి గాయాలతో, నోటితో తాడుని పట్టుకొని ఉన్న విశాల్ లుక్ ఆకట్టుకుంటోంది.

ఒకే రోజు విడుదలవుతున్న ఈ మూడు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని చేస్తాయో చూడాలి. అంతేకాదు ఈ తేదీకి ముందు రోజు ఆగష్టు 11 న మరో రెండు సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ విక్రమ్ 'కోబ్రా'తో పాటు.. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తో కలిసి నాగ చైతన్య నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' ఆగష్టు 11 న విడుదల కానున్నాయి.
![]() |
![]() |