![]() |
![]() |

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఏజెంట్'. ఈ స్పై థ్రిల్లర్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సురేందర్ 2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా సురేందర్ రెడ్డి తప్పుకున్నారని.. దర్శక నిర్మాతల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిర్మాత అనిల్ సుంకర ఖండించారు.
'ఏజెంట్' మూవీ గురించి వస్తున్న రూమర్స్ పై అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏజెంట్ కొత్త షెడ్యూల్ మనాలిలో జరుగుతుందని తెలిపారు. త్వరలోనే టీజర్ కి సంబంధించిన అప్డేట్ ఇస్తామని అన్నారు. సినిమా గురించి వస్తున్న రూమర్స్ పట్టించుకోవద్దని.. సినిమా అప్డేట్స్ కోసం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ మాత్రమే ఫాలో అవ్వాలని కోరారు. అనిల్ సుంకర ట్వీట్ తో ఏజెంట్ గురించి వస్తున్న వార్తలు రూమర్స్ అని తేలిపోయింది.

'ఏజెంట్'లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ మమ్మూట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాకి హిప్ హాప్ తమిజా మ్యూజిక్ డైరెక్టర్. ఆగష్టు 12 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |