![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' మరో మైలురాయిని చేరుకుంది. యూఎస్ఏ లో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ అందుకుంది. మహేష్ కెరీర్ లో ఈ ఫీట్ సాధించిన నాలుగో సినిమాగా నిలిచింది.
మే 12న విడుదలైన 'సర్కారు వారి పాట' మొదటి రోజు డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. రివ్యూలు కూడా నెగటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ అన్ని చోట్లా భారీ కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల షేర్ దిశగా అడుగులు వేస్తున్న 'సర్కారు వారి పాట'.. మహేష్ కి అడ్డాగా చెప్పుకునే ఓవర్సీస్ లో దుమ్ము దులుపుతోంది. విడుదలైన నాలుగుల్లోనే ఈ సినిమా యూఎస్ లో 2 మిలియన్ మార్క్ అందుకుంది. గతంలో మహేష్ నటించిన మూడు సినిమాలు 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'సరిలేరు నీకెవ్వరు' ఈ ఫీట్ సాధించగా.. ఇప్పుడు 'సర్కారు వారి పాట' ఆ లిస్టులో చేరింది.
యూఎస్ లో అత్యధిక 2 మిలియన్ సినిమాలు ఉన్న తెలుగు హీరోలలో 4 సినిమాలతో ప్రభాస్ టాప్ లో ఉండగా.. ఇప్పుడు మహేష్ ఆ రికార్డుని సమం చేశాడు. అయితే ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో ఈ ఫీట్ సాధించగా.. రీజినల్ మూవీస్ తో మహేష్ సంచలనం సృష్టించడం విశేషం. ప్రభాస్, మహేష్ తర్వాతి స్థానంలో మూడు సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు.
![]() |
![]() |