![]() |
![]() |

డివైడ్ టాక్ తోనూ 'సర్కారు వారి పాట' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ మే 12న విడుదలై మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల షేర్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే మరి కొద్దిరోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశముంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 36.01 కోట్ల షేర్, రెండో రోజు 11.04 కోట్ల షేర్ రాబట్టిన 'సర్కారు వారి పాట'.. మూడో రోజు కూడా 12.01 కోట్ల షేర్ తో సత్తా చాటింది. మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 59.06 కోట్ల షేర్(84.40 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఇప్పటిదాకా నైజాంలో 22.48 కోట్లు, సీడెడ్ లో 7.38 కోట్లు, ఆంధ్రాలో 29.20 కోట్ల షేర్ వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 45.21 కోట్ల షేర్, రెండో రోజు 13 కోట్ల షేర్ రాబట్టిన 'సర్కారు వారి పాట'.. మూడో రోజు 14.01 కోట్ల షేర్ రాబట్టింది. మూడు రోజుల్లో రెస్టాఫ్ ఇండియా 3.95 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 9.21 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 72.22 కోట్ల షేర్(112 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 48 కోట్ల దూరంలో ఉంది.
![]() |
![]() |