![]() |
![]() |

ఓవర్సీస్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజే వేరు. ముఖ్యంగా అమెరికాలో మహేష్ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. చాలా సినిమాలు 1 మిలియన్ మార్క్ అందుకోవడానికి కష్టపడుతుంటాయి. కానీ మహేష్ సినిమాలు మాత్రం సునాయాసంగా 1 మిలియన్ మార్క్ దాటతాయి. కేవలం టాలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే మరే హీరోకి లేనివిధంగా యూఎస్ లో 1 మిలియన్ మార్క్ దాటిన సినిమాలు మహేష్ ఖాతాలో 11 ఉండటం విశేషం.
మహేష్ హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' నిన్న(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ ఫస్ట్ డేనే 1 మిలియన్ మార్క్ అందుకుంది. దీంతో మహేష్ కెరీర్ లో1 మిలియన్ మార్క్ అందుకున్న 11 వ సినిమాగా నిలిచింది. మహేష్ సినిమాలలో 2011 లో విడుదలైన 'దూకుడు' నుంచి ఒక్క 'బిజినెస్ మేన్' తప్ప మిగతా అన్ని సినిమాలు ఈ ఫీట్ సాధించడం విశేషం.
యూఎస్ లో అత్యధిక 1 మిలియన్ మూవీలు ఉన్న టాలీవుడ్ హీరోలలో మహేష్ తర్వాతి స్థానంలో 7 సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో పవన్ కళ్యాణ్-6, నాని-6, అల్లు అర్జున్-5, ప్రభాస్-4, రామ్ చరణ్-3, విజయ్ దేవరకొండ-3, వరుణ్ తేజ్-3 ఉన్నారు.
![]() |
![]() |