![]() |
![]() |

మహేశ్ సినిమా 'సర్కారువారి పాట' మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి, అదిరిపోయే ఓపెనింగ్స్‌ను రాబట్టింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెమండస్‌గా జరగడంతో తెలంగాణ ఏరియాలో 'ఆర్ఆర్ఆర్' తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ క్రేజీ ఫిల్మ్ 'భీమ్లా నాయక్' ఓపెనింగ్స్‌ను సైతం ఈ సినిమా దాటేయడం గమనార్హం. తొలిరోజు తెలంగాణలో 'సర్కారువారి పాట' రూ. 12.24 కోట్ల షేర్‌ను సాధించి, రూ. 11.85 కోట్లతో 'భీమ్లా నాయక్' సాధించిన రికార్డును దాటేసింది. అయితే రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' ఈ సినిమాలకు ఏమాత్రం అందని రీతిలో ఫస్ట్ డే తెలంగాణలో రూ. 23.35 కోట్ల షేర్‌ను సాధించింది.
తెలంగాణలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 సినిమాల్లో మహేశ్‌వి రెండు ఉన్నాయి. ఆయన మునుపటి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' రూ. 8.67 కోట్ల షేర్‌తో ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. రూ. 11.44 కోట్లతో 'పుష్ప' నాలుగో స్థానం, 10.80 కోట్లతో 'రాధేశ్యామ్' ఐదో స్థానం, 9.68 కోట్లతో 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఆరో స్థానం, 9.41 కోట్లతో 'సాహో' ఏడో స్థానం, 8.90 కోట్లతో 'బాహుబలి 2' ఎనిమిదో స్థానం, 8.75 కోట్లతో 'వకీల్ సాబ్' తొమ్మిదో స్థానంలో నిలిచాయి. అంటే తెలంగాణలో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ప్రభాస్‌వి మూడు సినిమాలు, పవన్ కల్యాణ్‌వి రెండు సినిమాలు ఉన్నాయి.
మహేశ్ జోడీగా కీర్తి సురేశ్ నటించిన 'సర్కారువారి పాట'ను పరశురామ్ డైరెక్ట్ చేయగా, తమన్ సంగీత దర్శకుడిగా, ఆర్. మది సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.
![]() |
![]() |