![]() |
![]() |

కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం తన లేటెస్ట్ ఫిల్మ్ 'ధాకడ్' ప్రమోషన్స్ నిమిత్తం ఢిల్లీకి వెళ్లింది. అక్కడ ఆమె మహేశ్‌బాబు కాంట్రవర్సీ స్టేట్‌మెంట్ గురించి మాట్లాడింది. నాలుగైదు రోజులుగా బాలీవుడ్‌పై మహేశ్ చేసిన కామెంట్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. హిందీ సినిమా తనను భరించలేదంటూ మహేశ్ చేసిన వ్యాఖ్యపై కంగన తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
'ధాకడ్' ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు మహేశ్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా ఎదురైన ప్రశ్నకు, "ఆయన సరిగ్గానే చెప్పాడు" అని చెప్పింది కంగన. "అనేకమంది డైరెక్టర్స్ నుంచి ఆయనకు చాలా ఆఫర్లు రావడం నాకు తెలుసు. భారతీ సినీ పరిశ్రమలో ఆయన జనరేషన్ యాక్టర్లు తెలుగు సినిమాను అగ్రభాగాన నిలిపారు. ఫలితం, ఆయనను బాలీవుడ్ భరించలేదు. అయితే ఆయన ఏ సందర్భంలో ఆ కామెంట్ చేశారో నాకు తెలీదు" అందామె.
"ఆయన తన ఇండస్ట్రీపై గొప్ప గౌరవాన్ని చూపిస్తున్నాడు. గత పది, పదిహేనేళ్లుగా తెలుగు సినిమా వెలిగిపోతోందనడంలో ఎలాంటి వివాదమూ లేదు. వారి నుంచి మనం చాలా నేర్చుకోవాలి" అని కూడా తెలిపింది కంగన. రెండు ఇండస్ట్రీల మధ్య భాషా భేదంపై మాట్లాడటానికి ఆమె అంగీకరించలేదు. "దేశంలో అనేక భాషలున్నాయి. ఏ భాషా ఇంకో భాష కంటే ఎక్కువా కాదు, తక్కువా కాదు" అని ఆమె తన అభిప్రాయం చెప్పింది.
'సర్కారువారి పాట' ప్రమోషన్స్ సందర్భంగా 'హిందీ సినిమాల్లో నటిస్తారా?' అనే ప్రశ్న ఎదురైనప్పుడు, 'హిందీ నుంచి నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. సింపుల్ విషయమేమంటే వాళ్లు నన్ను భరించలేరు. నా టైమ్‌ను వేస్ట్ చేసుకోలేను. ఇక్కడ నాకు మంచి గౌరవం లభిస్తోంది. ఇక్కడే నాకు స్టార్‌డమ్ లభించింది. నా ఇండస్ట్రీని వదిలిపెట్టి ఇంకో చోటకు వెళ్లాలనే ఆలోచన నాకు నిజంగా లేదు.' అని చెప్పాడు మహేశ్.
![]() |
![]() |