![]() |
![]() |

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఎఫ్3'తో థియేటర్లలో నవ్వులు పంచడానికి మే 27న సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరిసున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఎఫ్3 లో వెంకటేష్ కు జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ సందడి చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ఎఫ్ 3 థియేట్రికల్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ ట్రైలర్ లో చాలా సర్ప్రైజ్ లు అలరించాయి. అయితే సినిమాలో ఇంతకుమించిన సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇలా సర్ ప్రైజ్ ఇచ్చే ఎలిమెంట్స్ లో తమన్నా చేసిన హారిక పాత్ర ఒక మేజర్ హైలెట్ గా ఉండబోతుందని సమాచారం.
ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుంది. ఎఫ్ 2కు మించి హారిక పాత్రని అద్భుతంగా ఎఫ్3లో డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 3 కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. నటనకి ఆస్కారం వున్న హారిక పాత్రలో తమన్నా నటన నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. వెంకటేష్- తమన్నా ల మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉండబోతున్నాయి. 'మన ఆశలే మన విలువలు' అంటూ ఎఫ్3 లో హారిక పాత్రధారి తమన్నా చెప్పిన క్యాచీ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ హారిక క్యారెక్టరైజేషన్ లో కీలకంగా వుంటుంది. ఆశలతో మేడలు కట్టే హారికకి సోనాల్ చౌహాన్ పాత్ర పరిచయంతో కథలో బ్రిలియంట్ సర్ ప్రైజ్ రాబోతుంది. ఈ సర్ ప్రైజ్ సినిమాలో అద్భుతంగా వుండబోతుంది. తమన్నా కెరీర్ లో హారిక పాత్ర ది బెస్ట్ గా నిలవనుందని అంటున్నారు. ఎఫ్3 నుండి తమన్నా రెడ్ హాట్ డ్రెస్ లో ఉన్న పిక్స్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేసారు. ఇందులో తమన్నా చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ట్రైలర్ కేవలం సాంపిల్ మాత్రమే. ట్రైలర్ కు మించిన నవ్వుల వర్షం థియేటర్ లో కురవబోతుందని మూవీ టీమ్ చెబుతోంది. పూజా హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ లో సందడి చేయబోతున్న ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ, రఘుబాబు వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.
![]() |
![]() |