![]() |
![]() |

మహేశ్‌బాబు హీరోగా నటించిన 'సర్కారువారి పాట' సినిమా గురువారం మే 12న సూపర్బ్ ఓపెనింగ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విమర్శకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు విడుదలకు ముందు వచ్చిన క్రేజ్, హైప్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఫలితంగా మహేశ్ కెరీర్‌లోనే ఈ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. వరల్డ్‌వైడ్‌గా రూ. 45.21 కోట్ల షేర్, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 36.01 కోట్ల షేర్‌ను ఈ సినిమా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో మొదటిరోజు 'సర్కారువారి పాట'కు రూ. 12.24 కోట్ల షేర్ వచ్చింది. రాయలసీమలో రూ. 4.70 కోట్లు రాబట్టిన ఈ మూవీ, ఆంధ్రా ఏరియాలో 19.07 కోట్లను వసూలు చేయడం విశేషం. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ రేంజ్ షేర్లు రావడంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు చాలా హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు.
ఓవర్సీస్‌లోనూ 'సర్కారువారి పాట' బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. అక్కడ ఫస్ట్ డే ఈ సినిమా రూ. 6.50 కోట్ల షేర్‌ను సాధించింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2.70 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రి బిజినెస్ వాల్యూ రూ. 120 కోట్లు. అందులో తొలిరోజే 37 శాతం పైగా రికవరీ సాధించింది 'సర్కారువారి పాట'. టాక్ ఎలా ఉన్నప్పటికీ ఫస్ట్ డే ఇలాంటి సూపర్బ్ ఫిగర్స్‌ను ఈ మూవీ సాధించడంతో మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మహేశ్ సరసన కీర్తి సురేశ్ తొలిసారి నాయికగా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు కాగా, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి.
![]() |
![]() |