![]() |
![]() |

బయోపిక్ ల ట్రెండ్ ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే ఇతర సినీ పరిశ్రమలతో పోల్చితే టాలీవుడ్ లో బయోపిక్ లు తెరకెక్కడం తక్కువనే చెప్పొచ్చు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సంచలన విజయాన్ని అందుకోగా.. రెండు భాగాలుగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం నిరాశ పరిచింది. దీంతో బయోపిక్ లపై స్టార్స్ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అయితే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తెరపైకి వచ్చింది.
మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న 'మేజర్' సినిమా ట్రైలర్ లాంచ్ సోమవారం జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న మహేష్ కి కృష్ణ బయోపిక్ కి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా, ఆసక్తికర సమాధానం చెప్పాడు. నాన్న గారి బయోపిక్ ఎవరైనా తీస్తే ఆనందంగా చూస్తానని, కానీ ఆయన పాత్రలో తాను నటించలేనని, ఎందుకంటే ఆయన తన దేవుడని అన్నాడు. అయితే ఎవరైనా డైరెక్టర్ నాన్న గారి బయోపిక్ ప్రపోజల్ తో వస్తే.. నిర్మించడానికి సిద్ధంగా ఉన్నానని మహేష్ చెప్పుకొచ్చాడు.
మరి మహేష్ ఆఫర్ తో ఎవరైనా డైరెక్టర్.. కృష్ణ బయోపిక్ కి ప్లాన్ చేస్తారేమో చూడాలి. 'ఎన్టీఆర్ బయోపిక్' రిజల్ట్ తో దాదాపు సాహసం ఎవరూ చేయకపోవచ్చు. ఒకవేళ చేసినా కృష్ణ పాత్రలో మహేష్ ని కాకుండా మరో హీరోని ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చెప్పలేము.
![]() |
![]() |