![]() |
![]() |

విభిన్న పాత్రలు చేసి మెప్పించగల సత్తా ఉన్నప్పటికీ అల్లరి నరేష్ కి కామెడీ హీరోగానే ఎక్కువ గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ముద్రను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు నరేష్. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన 'నాంది' సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకున్న నరేష్.. ఈ ఏడాది మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.
ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ఫస్ట్ లుక్ మంగళవారం నాడు విడుదలైంది. ఒంటి నిండా గాయాలతో ఉన్న నరేష్.. నులక మంచం కోడుని పట్టుకొని ఓ వైపు మోస్తున్నట్లుగా పోస్టర్ లో కనిపిస్తోంది. చూస్తుంటే రౌడీలతో కొట్లాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లుగా ఉంది. ఇది మారేడుమిల్లి అటవీప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదివాసీల కథ అని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నరేష్ నాంది లాంటి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.
![]() |
![]() |