Home

»

Latest News

మ్యూజిక‌ల్ హిట్ `ఆట‌`కి 15 ఏళ్ళు!

May 9, 2022 4:59PM

మ్యూజిక‌ల్ హిట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన నిర్మాత‌ల్లో మెగా ప్రొడ్యూస‌ర్ ఎమ్మెస్ రాజు ఒక‌రు.  సిద్ధార్ధ్, ఇలియానా జంట‌గా సుమంత్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రాజు నిర్మించిన `ఆట‌` కూడా ఈ త‌ర‌హా చిత్ర‌మే. `మ‌న‌సంతా నువ్వే` (2001) వంటి మెమ‌ర‌బుల్ మూవీ త‌రువాత ద‌ర్శ‌కుడు వి.ఎన్. ఆదిత్య - నిర్మాత ఎమ్మెస్ రాజు కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా ఇదే కావ‌డం విశేషం. మున్నా, సునీల్, శ‌ర‌త్ బాబు, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు, బ్ర‌హ్మానందం, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, సాయాజీ షిండే, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌మ‌ణ్యం, అనూరాధ‌, న‌ర్సింగ్ యాద‌వ్, ఏవీయ‌స్, ర‌విబాబు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రంలో అభిన‌య‌శ్రీ‌, గాయ‌ని స్మిత‌, ఎమ్మెస్ రాజు అతిథి పాత్ర‌ల్లో మెరిశారు. `గుడుంబా శంక‌ర్` (2004) ఛాయ‌ల‌తో సాగే ఈ సినిమాకి హ‌రీశ్ శంక‌ర్, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ర‌చ‌న చేశారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించిన `ఆట‌`కి `సిరివెన్నెల‌` సీతారామ శాస్త్రి, చంద్రబోస్ సాహిత్య‌మందించారు. ఇందులోని టైటిల్ సాంగ్ తో పాటు ``నిన్ను చూస్తుంటే``, ``ముద్దులాట‌``, ``కాకినాడ కాజా కాజా``, ``యేలా యేలా``, ``హొయ‌నా`` ఇలా అన్ని పాట‌లు కూడా ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. 2007 మే 9న విడుద‌లై చెప్పుకోద‌గ్గ విజ‌యం సాధించిన `ఆట‌`.. నేటితో 15 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com