![]() |
![]() |
![]()
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన అద్భుతాల్లో 'అవతార్' ఒకటి. 2009 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సంచలనం సృష్టించింది. ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా రికార్డు ఇంతవరకు చెక్కు చెదరలేదు. 13 ఏళ్ళ తర్వాత 'అవతార్-2'తో ఆ రికార్డుని బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు జేమ్స్ కామెరాన్.
![]()
'అవతార్: ది వే ఆఫ్ వాటర్' పేరుతో 2022, డిసెంబర్ 16న అవతార్-2 విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 160 భాషలలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే విజువల్స్ పరంగా అవతార్ ని మించి ఉండబోతోందని అర్థమవుతోంది. ఓ కొత్త మాయా లోకంలోకి వెళ్లినట్లు అనిపిస్తోంది. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ మనల్ని మనం మర్చిపోయేలా చేస్తోంది. జేమ్స్ కామెరాన్ సృష్టించిన మాయాజాలం వెండితెరపై మరోసారి కాసుల వర్షం కురిపించడం ఖాయమనిపిస్తోంది.
![]() |
![]() |