![]() |
![]() |

త్వరలో నటి నమిత తల్లి కాబోతోంది. 41 ఏళ్ల నమిత, ఆమె భర్త తమ తొలి బిడ్డను కనేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తాను గర్భం దాల్చినట్లు తెలియజేయడమే కాకుండా, కడుపుతో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. 2017లో ఆమె తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని తిరుపతిలో పెళ్లాడింది.
తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపిన ఆమె, పొట్ట లోపల శిశువు తన కాళ్లతో సున్నితంగా కొడుతున్నట్లు ఫీలవుతున్నానని చెప్పింది. కడుపుతో ఫొటోషూట్ చేసిన ఆమె, దానికి సంబంధించిన పిక్చర్స్‌ను షేర్ చేసింది.
"మాతృత్వం
కొత్త అధ్యాయం మొదలైనప్పుడు, నేను మారాను, నాలో ఏదో మారుతోంది, చాలా మృదువుగా.
నాపై ప్రకాశవంతమైన పసుపు సూర్యరశ్మి, కొత్త జీవితం, కొత్త జీవులు నన్ను పిలుస్తున్నప్పుడు,
నేను కోరుకున్నదంతా నువ్వే, చాలా కాలంగా నీ కోసం ప్రార్థించాను,
నీ సున్నితమైన తాపులు, కదలికలు, అన్నింటీనీ నేను ఫీల్ అవుతున్నాను,
నేను ఇదివరకెన్నడూ లేనంతగా, అదే సమయంలో ఇదివరకు ఎప్పుడూ ఉన్నదాని కంటే గొప్పగా ఉండేలా చేస్తున్నావు!
నమిత"
అంటూ ఆమె రాసుకొచ్చింది. 2002లో ఆర్యన్ రాజేశ్ సరసన నటించిన 'సొంతం' సినిమాతో ఆమె టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మొదట్లో భైరవి పేరుతో నటించిన ఆమె, ఆ తర్వాత తన అసలు పేరుకు మారిపోయింది. ఆమె చేసిన సినిమాల్లో 'జెమిని', 'ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి', 'నాయకుడు', 'బిల్లా', 'సింహా' లాంటివి ఉన్నాయి.

![]() |
![]() |