![]() |
![]() |

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొడుకుకు నీల్ అని పేరు కూడా పెట్టేసింది. అయితే ఈరోజు మాతృ దినోత్సవం కావడంతో తన కొడుకుతో దిగిన ఫోటోలను తాజాగా కాజల్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
2020లో గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను కాజల్ విహహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసిన చందమామ.. ప్రెగ్నెంట్ అయ్యాక సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రెగ్నన్సీ టైంలోనూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ఫోటోలు పంచుకున్న కాజల్.. తల్లి అయ్యాక మొదటిసారి కుమారుడి ఫోటోలను పంచుకుంది. మదర్స్ డే సందర్భంగా కొడుకుని గుండెలకు హత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేసిన కాజల్.. కొడుకే తన ప్రపంచమని, కొడుకే తనకు సర్వస్వమని రాసుకొచ్చింది.

అలాగే తన చెల్లి నిషా అగర్వాల్ తో పాటు ఇతర కుటుంబసభ్యులు నీల్ ని ఎత్తుకొని ఆడిస్తున్న ఫోటోలను కూడా కాజల్ పంచుకుంది. అయితే ఫోటోలలో తన కొడుకు ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడింది. కాస్త పెద్దయ్యాక కుమారుడి ఫేస్ ని రివీల్ చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |