![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ప్రాజెక్ట్-k'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి మరో బాలీవుడ్ బ్యూటీ ఎంటర్ అయింది.

'ప్రాజెక్ట్-k'లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా దిశానే తెలియజేసింది. ప్రాజెక్ట్-k ని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ సంస్థ నుంచి తనకు వచ్చిన గిఫ్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ప్రాజెక్ట్-k లో భాగమైన నిన్ను చిత్రబృందం సాదరంగా ఆహ్వానిస్తోంది' అంటూ ఆ గిఫ్ట్ కవర్ పై రాసుంది. దీంతో ప్రాజెక్ట్-k లో దిశా పటానీ నటిస్తోందని కన్ఫర్మ్ అయింది.
![]() |
![]() |