![]() |
![]() |
.webp)
'కేజీఎఫ్ చాప్టర్-2' మూవీ మరో సంచలనం సృష్టించింది. 24 రోజుల్లోనే 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్ ని దాటేసి.. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమాల లిస్టులో మూడో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో 'దంగల్'(రూ.1958 కోట్ల గ్రాస్), 'బాహుబలి-2'(రూ.1810 కోట్ల గ్రాస్) సినిమాలు ఉన్నాయి.
మార్చి 25 న విడుదలైన ఆర్ఆర్ఆర్ 44 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1129.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొన్నటి వరకు 'దంగల్', 'బాహుబలి-2' తర్వాత స్థానంలో ఆర్ఆర్ఆర్ ఉండగా.. ఇప్పుడు ఆ స్థానంలోకి కేజీఎఫ్-2 వచ్చింది. ఏప్రిల్ 14 న విడుదలైన కేజీఎఫ్-2.. 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1130.60 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కి 1-2 కోట్ల గ్రాస్ వస్తుండగా.. కేజీఎఫ్-2 కి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ వస్తుంది. మరికొద్దిరోజుల పాటు ఇదే రోజు కొనసాగితే త్వరలోనే 1200 కోట్ల మార్క్ దాటి.. 1300 కోట్లకు చేరువయ్యే అవకాశముంది.
వరల్డ్ వైడ్ గా రూ.345 కోట్ల బిజినెస్ చేసిన కేజీఎఫ్-2 మూవీ 24వ రోజు 5.76 కోట్ల షేర్(12.05 కోట్ల గ్రాస్) రాబట్టి ఓవరాల్ గా ఇప్పటిదాకా 558.10 కోట్ల షేర్(1130.60 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఇప్పటికే బయ్యర్లకు 210 కోట్లకు పైగా ప్రాఫిట్స్ మిగిల్చింది. 24 రోజుల్లో కర్ణాటకలో 99.55 కోట్లు(100 కోట్లు బిజినెస్), తెలుగు రాష్ట్రాల్లో 82 కోట్లు(78 కోట్లు బిజినెస్), తమిళనాడు 49.50 కోట్లు(27 కోట్లు బిజినెస్), కేరళ 29.10 కోట్లు(10 కోట్లు బిజినెస్), హిందీ+రెస్టాఫ్ ఇండియా 207.25 కోట్లు(100 కోట్లు బిజినెస్), ఓవర్సీస్ 90.70 కోట్ల(30 కోట్లు బిజినెస్) షేర్ రాబట్టి దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది.
![]() |
![]() |