Home  »  News  »  'F3' ట్రైలర్.. వెంకీకి రేచీకటి, వరుణ్ నత్తి.. అంతేగా అంతేగా

Updated : May 9, 2022

2019 జనవరిలో సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు వెంకటేష్, వరుణ్ తేజ్. మూడేళ్ళ తర్వాత ఈ మే 27న సమ్మర్ సోగ్గాళ్లుగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'F2' కి సీక్వెల్ గా వస్తున్న 'F3' మూవీ ట్రైలర్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

'F3' మూవీ 'F2'కి కొనసాగింపు కాదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అవే క్యారెక్టర్స్ తో ఈ ఫ్రాంచైజ్ నుంచి మరో కొత్త కథతో వస్తున్నారు. 'F2'లో భార్యల వల్ల భర్తలకు ఫ్రస్ట్రేషన్, ఆడియన్స్ కి ఫన్ అయితే.. 'F3'లో మనీ(డబ్బు) వల్ల ఫన్, ఫ్రస్ట్రేషన్ ఉండనున్నాయి. తమన్నా, మెహ్రీన్ ఇందులోనూ సిస్టర్స్ గా కనిపించనున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మంగ టిఫిన్ సెంటర్ నడుపుతూ బాగా డబ్బంటే ఆశ ఉన్నట్లుగా చూపించారు. అలాగే వెంకటేష్ కి రేచీకటి, వరుణ్ కి నత్తి ఉన్నట్లుగా చూపించారు. అసలే డబ్బుల కోసం ఫ్రస్ట్రేషన్ అంటే.. దానికి తోడు లోపాలు కూడా ఉండటంతో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ డబుల్ అవుతుంది.

మనీ మీద ఆశతో మనీ ప్లాంట్ ఆకులతో కూరలు వండుకోవడం.. వరుణ్ నత్తి, వెంకీ రేచీకటి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక చివరిలో 'అంతేగా అంతేగా' అని డైలాగ్ రావడం.. సీక్వెల్ లో కూడా సేమ్ డైలాగా అనడం ఆకట్టుకుంది. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్, మ్యానరిజమ్స్ లో 'F2' వాసనే ఎక్కువగా కనిపిస్తుంది. మరి 'F3' కూడా 'F2' లాగే కలెక్షన్లు కొల్లగొట్టి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.