![]() |
![]() |

'ఇస్మార్ట్ శంకర్' సినిమా నుంచి రూట్ మార్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరో మాస్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. అదే 'ది వారియర్'. కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కి, 'బుల్లెట్' సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఈ మూవీ నుంచి మరో సర్ ప్రైజ్ రాబోతోంది.
మే 14న సాయంత్రం 5:31 కి 'ది వారియర్' టీజర్ ని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ వదిలారు. అందులో బైక్ పై వెళ్తూ మీసకట్టుతో ఉన్న రామ్ లుక్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే పోలీస్ లుక్ లో ఉన్న రామ్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన పోస్టర్ కూడా పవర్ ఫుల్ గా ఉంది. మరి టీజర్ కూడా ఇదే స్థాయిలో ఉంటుందేమో చూడాలి.

శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |