![]() |
![]() |

2020 లో విడుదలైన 'భీష్మ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్.. గతేడాది 'చెక్', 'రంగ్ దే', 'మాస్ట్రో' సినిమాలతో నిరాశపరిచాడు. అందుకే ఈ ఏడాది మాస్ ఎంటర్టైనర్ తో సాలిడ్ హిట్ అందుకోవాలి అనుకుంటున్నాడు. నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఫస్ట్ ఎటాక్ పేరుతో విడుదల చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు.
'మాచర్ల నియోజకవర్గం' సినిమాని ఆగష్టు 12 న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ వదిలారు. ఇందులో గత చిత్రాలకు భిన్నంగా ఉన్న నితిన్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇన్ షర్ట్, హ్యాండ్స్ ఫోల్డ్ చేసి మీసకట్టుతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. నిజానికి ఏప్రిల్ 29 న విడుదల కావాల్సిన ఈ సినిమా జూలై 8 కి వాయిదా పడింది. ఇప్పుడు ఆగష్టు 12 కి వెళ్ళిపోయింది. మరి లేట్ గా వస్తున్న ఈ మూవీ లేటెస్ట్ గా నితిన్ కి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |