![]() |
![]() |

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేయింది. ఈ మూవీ హిందీ వెర్షన్ ఆమిర్ ఖాన్ 'దంగల్' లైఫ్‌టైమ్ కలెక్షన్‌ను దాటేసింది. 21 రోజుల్లో రూ. 391 కోట్ల నెట్‌ను వసూలుచేసిన 'కేజీఎఫ్ 2'.. రాజమౌళి 'బాహుబలి 2' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో హిందీ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. త్వరలోనే ఇండియాలో ఈ మూవీ రూ. 400 కోట్ల మార్కును అందుకోవడం ఖాయం.
ఏప్రిల్ 14న ఐదు భాషల్లో 'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజయ్యింది. ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసల్ని అమితంగా అందుకుంటూ విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్ల మార్కుకు చేరువవుతోంది. హిందీ వెర్షన్ ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తుండటం గమనార్హం. బుధవారం ఈ సినిమా రూ. 8.75 కోట్లను వసూలు చేసింది. మూడో వారం విషయానికి వస్తే.. శుక్రవారం రూ. 4.25 కోట్లు, శనివారం రూ. 7.25 కోట్లు, ఆదివారం రూ. 9.27 కోట్లు, సోమవారం రూ. 3.75 కోట్లు, మంగళవారం రూ. 9.57 కోట్లను ఈ సినిమా రాబట్టింది. వెరసి.. 'కేజీఎఫ్ 2' హిందీ వెర్షన్ వసూళ్లు దేశంలో రూ. 391.65 కోట్లకు చేరుకున్నాయి.
'కేజీఎఫ్ చాప్టర్ 2'లో యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలు పోషించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ను హస్తగతం చేసుకున్న రాకీ, అక్కడి గనుల్లో పనిచేసే జనానికి ఎలా దేవుడిగా మారాడు, విరోధుల్ని ఎలా ఎదుర్కున్నాడనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం.
ఆమిర్ ఖాన్ 'దంగల్' విషయానికి వస్తే.. అది మహిళా రెజ్లర్లు గీతా ఫొగట్, బబితా ఫొగట్ బయోపిక్‌గా రూపొందింది. ఆ పాత్రల్ని ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రా పోషించగా, వారి తండ్రిగా ఆమిర్ నటించాడు.
![]() |
![]() |