![]() |
![]() |

మార్చి 25 న విడుదలైన 'ఆర్ఆర్ఆర్' ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ త్వరలో ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది.
'ఆర్ఆర్ఆర్' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5, నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నాయని సమాచారం. మే 20 నుంచి ఈ రెండు ప్లాట్ ఫామ్స్ లో 'ఆర్ఆర్ఆర్' మూవీ స్ట్రీమింగ్ కానుందని న్యూస్ వినిపిస్తోంది. అయితే ఇక్కడో మెలిక ఉందట. ఈ ప్లాట్ ఫామ్స్ కి సబ్ స్క్రైబ్ చేసుకున్నప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలంటే కొత్త మొత్తం అదనంగా చెల్లించాలట. రెండు వారాల తర్వాత అంటే జూన్ 3 నుంచి మాత్రం అదనంగా చెల్లించకుండానే సబ్ స్క్రైబర్లు ఈ మూవీ చూడొచ్చని అంటున్నారు.
మరి 'ఆర్ఆర్ఆర్' మూవీ నిజంగానే మే 20 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తే తారక్ ఫ్యాన్స్ బిగ్ గిఫ్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆరోజు తారక్ పుట్టినరోజు. అదేరోజు తారక్-కొరటాల శివ మూవీ(#NTR30) అప్డేట్ రానుంది. 'ఆర్ఆర్ఆర్' కూడా అదే రోజు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తే తారక్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు.
![]() |
![]() |