![]() |
![]() |

బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'జయమ్మ పంచాయితీ'. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా మూవీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు.
'జయమ్మ పంచాయితీ' రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జయమ్మ భర్తకు అనారోగ్య సమస్య రావడంతో డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్తాడు. కూతురుకి ఫంక్షన్ జరిపి ఆ వచ్చిన చదివింపులతో ఆపరేషన్ చేయించాలని జయమ్మ ప్లాన్ చేస్తుంది. మరోవైపు తన కూతురితో ఒకబ్బాయి చనువుగా ఉండటాన్ని తట్టుకోలేక ఊగిపోతుంటుంది. ఇదే సమయంలో జయమ్మకు మరో సమస్య వస్తుంది. తన గొడవ తీర్చాలంటూ ఊరి పెద్ద మనుషులను నిలదీస్తుంది. అసలు జయమ్మ పంచాయితీ ఏంటి? జయమ్మ విజయం సాధించిందా? వంటి సందేహాలతో ట్రైలర్ ను ఆసక్తికరంగా కట్ చేశారు.
జయమ్మగా సుమ ఆకట్టుకుంటుంది. శ్రీకాకుళం యాసలో ఆమె చెప్పే డైలాగ్స్ మెప్పిస్తున్నాయి. కీరవాణి సంగీతం ప్రత్యెక ఆకర్షణగా నిలిచింది. మరి 'జయమ్మ పంచాయితీ'తో సుమ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |