![]() |
![]() |

విభిన్న చిత్రాలు, విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భళా తందనాన'. వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి, సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకుడు. మే 6 న విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిన్న సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి చీఫ్ గెస్ట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవిష్ణు చాలా అరుదైన యాక్టర్ అని, అతనికి మంచి భవిష్యత్ ఉందని ప్రశంసించారు.
"చైతన్య బాణం సినిమా చూసినప్పుడు నాకొకటి అనిపించింది. ఏంటంటే తను చిన్న సినిమా చేసినా సరే.. పెద్ద సినిమా చేస్తున్నాను అనే యాటిట్యూడ్ సినిమాలో కనిపించేలా చేస్తాడు. 'భళా తందనాన' కూడా చూశాను. పేరుకి చిన్న సినిమా కానీ ఎక్కడా చిన్న సినిమాలా డీల్ చేయలేదు. రైటింగ్, డైరెక్షన్ చాలా బాగుంది." అని రాజమౌళి చెప్పారు.
"శ్రీవిష్ణు పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. కానీ చేప నీళ్ళలోకి ఎంత ఈజీగా వెళ్లిపోగలదో.. మాస్ రోల్ లోకి అంత ఈజీగా వెళ్లగలడు. అది చాలా మంచి క్వాలిటీ. తను మాస్ రోల్ లోకి అంత ఈజీగా షిఫ్ట్ అవ్వగలడు అసలు ఊహించం. ప్రస్తుతం తెలుగులో ఆ క్వాలిటీ ఉన్న ఒకే ఒక్క హీరో శ్రీవిష్ణు. తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది." అని రాజమౌళి ప్రశంసించారు.
"మా సాయి గారు(సాయి కొర్రపాటి) ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్-2' వంటి పెద్ద సినిమాలా డిస్కషన్ టైంలో కూడా ఆయన భళా తందనాన చాలా బాగా వచ్చిందని కాన్ఫిడెంట్ గా చెప్పేవారు. ఓటీటీ నుంచి మంచి ఆఫర్ వచ్చినా కూడా సినిమా మీద నమ్మకంతో థియేటర్స్ లోకి వస్తున్నారు. సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను.. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది" అని రాజమౌళి అన్నారు.
![]() |
![]() |