![]() |
![]() |

విడుదలైన నాలుగో రోజు వరల్డ్ వైడ్ గా కేవలం రూ.60 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసి షాకిచ్చిన 'ఆచార్య' సినిమా ఐదోరోజు రంజాన్ కావడంతో పుంజుకుంది. మంగళవారం నాడు కోటికి పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకుంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హైర్స్ తో కలిపి 29.50 కోట్ల షేర్ రాబట్టిన ఆచార్య.. రెండో రోజు 5.15 కోట్లు, మూడో రోజు 4.07 కోట్ల షేర్ వసూలు చేసింది. నాలుగో రోజు సోమవారం కావడంతో 53 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఐదోరోజు రంజాన్ కావడంతో కాస్త పుంజుకొని 82 లక్షల షేర్ రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 107.50 కోట్ల బిజినెస్ చేసిన ఆచార్య ఐదు రోజుల్లో 40.07 కోట్ల(58.45 కోట్ల గ్రాస్) సాధించింది. ఐదు రోజుల్లో ఈ మూవీ నైజాంలో 12.14 కోట్లు(బిజినెస్ 38 కోట్లు), సీడెడ్ లో 6.06 కోట్లు(బిజినెస్ 18.50 కోట్లు), ఆంధ్రాలో 21.87 కోట్ల(బిజినెస్ 51 కోట్లు) షేర్ రాబట్టింది.
అలాగే ఐదు రోజులకు గానూ కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి 2.65 కోట్లు(బిజినెస్ 11.70 కోట్లు), ఓవర్సీస్ 4.60 కోట్లు(బిజినెస్ 12 కోట్లు) కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 131.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆచార్య.. మొదటి రోజు 35.05 కోట్ల షేర్(52 కోట్ల గ్రాస్), రెండో రోజు 6.02 కోట్ల షేర్(10.85 కోట్ల గ్రాస్), మూడో రోజు 4.45 కోట్ల షేర్(7.80 కోట్ల గ్రాస్), నాలుగో రోజు 0.61 కోట్ల షేర్(1.35 కోట్ల గ్రాస్), ఐదో రోజు 1.14 కోట్ల షేర్(1.90 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఐదు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా 47.32 కోట్ల షేర్(73.90 కోట్ల గ్రాస్) సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 85 కోట్ల దూరంలో ఉంది. ఫుల్ రన్ లో బయ్యర్లకు ఈ మూవీ 75 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |