![]() |
![]() |

'గురు', 'ఎఫ్ 2', 'వెంకిమామ', 'నారప్ప', `దృశ్యం 2` వంటి వరుస జనరంజక చిత్రాల తరువాత సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ నుంచి రాబోతున్న సినిమా 'ఎఫ్ 3'. 2019 నాటి బ్లాక్ బస్టర్ మూవీ 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా రూపొందిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటించాడు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మల్టిస్టారర్.. వేసవి కానుకగా మే 27న జనం ముందుకు రాబోతోంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఇదే మే 27న వెంకీ తరం అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా మల్టిస్టారర్స్ తో సందడి చేయగా అవి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే.. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి చిరు నటించిన `మెకానిక్ అల్లుడు` 1993 మే 27న రిలీజ్ కాగా భారీ అంచనాల నడుమ వచ్చిన సదరు మల్టిస్టారర్ బాక్సాఫీస్ ముంగిట బోల్తాపడింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజుతో కలిసి బాలయ్య నటించిన `సుల్తాన్` కూడా 1999లో ఇదే మే 27న విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మరి.. చిరు, బాలయ్యకి మల్టిస్టారర్స్ పరంగా మైనస్ అయిన మే 27.. వెంకీకైనా కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |