![]() |
![]() |
.webp)
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి, లోక నాయకుడు కమల్ హాసన్, యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ.. ఒకే బాటలో వెళుతున్నారు. ఇంతకీ అదేమిటంటే.. తమకు అచ్చొచ్చిన తేదిల్లోనే తమ తమ తాజా చిత్రాలతో సందడి చేస్తున్నారీ స్టార్స్.
ఆ వివరాల్లోకి వెళితే.. 34 ఏళ్ళ క్రితం మెగాస్టార్ కి ఇండస్ట్రీ హిట్ ని అందించిన `యముడికి మొగుడు` (1988) ఏ తేదిన విడుదలైందో సరిగ్గా అదే ఏప్రిల్ 29ని టార్గెట్ చేసుకుని అతని కొత్త చిత్రం `ఆచార్య` రేపు రిలీజ్ కాబోతోంది. మరోవైపు.. కమల్ హాసన్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే `సాగర సంగమం` (1983) వంటి ఆల్ టైమ్ క్లాసిక్ విడుదలైన జూన్ 3ని లక్ష్యంగా చేసుకుని తన తాజా చిత్రం `విక్రమ్` సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. అదే విధంగా.. విజయ్ దేవరకొండ కెరీర్ ని మేలిమలుపు తిప్పిన `అర్జున్ రెడ్డి` (2017) ఏ తేదిన (ఆగస్టు 25) రిలీజైందో సరిగ్గా అదే రోజున అతని కొత్త చిత్రం `లైగర్` రాబోతోంది. మరి.. 34 ఏళ్ళ తరువాత `ఆచార్య`తో చిరంజీవి, 39 సంవత్సరాల అనంతరం `విక్రమ్`తో కమల్ హాసన్, ఐదేళ్ళ తరువాత `లైగర్`తో విజయ్ దేవరకొండ.. మెమరబుల్ డేట్స్ లో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసి ఘనవిజయాలు అందుకుంటారేమో చూడాలి.
![]() |
![]() |