![]() |
![]() |

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

'హ్యాపీ డేస్' సినిమాతో నటుడిగా టాలీవుడ్ కి పరిచయమైన నిఖిల్.. 'స్వామి రారా', 'కార్తికేయ' వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో '18 పేజెస్', 'కార్తికేయ-2'తో పలు సినిమాలు ఉన్నాయి.
![]() |
![]() |