![]() |
![]() |

కింగ్ నాగార్జున - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట కాసుల వర్షం కురిపించాయి. వాటిలో `ఘరానా బుల్లోడు` ఒకటి. `అన్నమయ్య`(1997)తో ఆధ్యాత్మిక బాట పట్టిన నాగ్ - రాఘవేంద్రరావు కాంబోకి ఇదే చివరి సోషల్ మూవీ కావడం విశేషం. ఇందులో నాగార్జునకి జంటగా రమ్యకృష్ణ, ఆమని నటించగా జయచిత్ర, మురళీ మోహన్, సుధ, జయంతి, శ్రీహరి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, తనికెళ్ళ భరణి, ఏవీయస్, సుధాకర్, మహేశ్ ఆనంద్, ధర్మవరపు సుబ్రమణ్యం ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
స్వరవాణి కీరవాణి బాణీలు అందించిన ఈ చిత్రానికి వేటూరి, వెన్నెలకంటి, జొన్నవిత్తుల సాహిత్యమందించారు. పాటల్లో ``భీమవరం బుల్లోడా`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``సై సై సయ్యారే``, ``అదిరిందిరో``, ``చుక్కల్లో తళుకులా``, ``ఏం కసి ఏం కసి``, ``వంగి వంగి`` అంటూ సాగే గీతాలు కూడా రంజింపజేశాయి. ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణ మోహనరావు నిర్మించిన `ఘరానా బుల్లోడు`.. 1995 ఏప్రిల్ 27న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ చిత్రం 27 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |