![]() |
![]() |
.webp)
అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన 'మేజర్' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. పలుసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీని ఈమధ్య మే 27న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఎందుకనో విడుదల తేదీని జూన్ 3కు మార్చారు. ఈ విషయాన్ని బుధవారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నిర్మాతల్లో ఒకరైన సూపర్‌స్టార్ మహేశ్ ప్రకటించాడు.
దీనికి సంబంధించిన అడివి శేష్ ఉన్న పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన, " #MAJOR In Cinemas June 3rd 2022" అని అనౌన్స్ చేశాడు. శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఏక కాలంలో తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించిన ఈ సినిమాని మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
2008 ముంబై దాడుల్లో టెర్రరిస్టుల నుంచి పౌరులను కాపాడే యత్నంలో ప్రాణాలు వదిలిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' మూవీ తయారవుతోంది. ఆ పాత్రను పోషించిన అడివి శేష్ స్వయంగా ఈ సినిమా స్క్రిప్టును రాశాడు.
సాయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌రాజ్, రేవతి, మురళీశర్మ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకునిగా, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

![]() |
![]() |