![]() |
![]() |
.webp)
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధ అనే కీలక పాత్రలో రామ్ చరణ్ నటించాడు. అయితే ఈ సిద్ధ పాత్రకి స్ఫూర్తి విప్లవ ప్రజాకవి 'సుబ్బారావు పాణిగ్రాహి' అనే సందేహం కలుగుతోంది.
సుబ్బారావు పాణిగ్రాహి 1934, సెప్టెంబర్ 8న శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువాలో ఒక పూజారి కుటుంబంలో జన్మించాడు. ఆయన బొడ్డపాడు గ్రామంలోని ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న సమయంలో.. దేవాలయ భూములను ఆక్రమించడానికి కొందరు ప్రయత్నించగా ఆయన అడ్డుపడ్డారట. అలా ఆయన పోరాటానికి నాంది పడినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఆయన తన కలంతో, గళంతో శ్రీకాకుళంలో విప్లవ జెండా ఎగరేశారు. ఆ పోరాటంలో ఆయనకు ఇద్దరు నక్సల్స్ అండగా నిలిచారట. విప్లవ భావాలున్న వారిద్దరూ వృత్తిరీత్యా ఉపాధ్యాయులు కావడం విశేషం.

ఆచార్య సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమా సుబ్బారావు పాణిగ్రాహి జీవితాన్ని పోలి ఉందనిపిస్తోంది. ట్రైలర్ లో గమనిస్తే సుబ్బారావు పాణిగ్రాహి లాగే సిద్ధ గుడిలో పని చేస్తుంటాడు, అలాగే విప్లవ భావాలూ ఉన్నాయి. పోరాటంలో పాణిగ్రాహికి నక్సల్ నేపథ్యమున్న ఉపాధ్యాయులు మద్దతుగా నిలిచినట్లుగానే.. సిద్ధకు నక్సలైట్ అయిన ఆచార్య అండగా నిలిచాడు. ఇక పాణిగ్రాహి 36 ఏళ్లకే ఎన్కౌంటర్ లో కన్నుమూయగా.. ఆచార్యలో సిద్ధ కూడా ఓ ఆశయం కోసం పోరాడుతూ కన్నుమూస్తాడని, ఆ ఆశయాన్ని ఆచార్య నెరవేరుస్తాడని అంటున్నారు.
ఇలా ఆచార్య సినిమాకి సుబ్బారావు పాణిగ్రాహి జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధ పాత్ర పాణిగ్రాహిని పోలి ఉంది. అయితే కొరటాల మాత్రం దీనిని ఖండిస్తున్నాడు. తాజాగా ఆచార్య ప్రమోషన్స్ లో ఈ విషయంపై స్పందించిన ఆయన.. ఇది తాను రాసుకున్న కల్పిత కథ అని, ఎవరినీ స్పూర్తిగా తీసుకొని రాయలేదని చెప్పారు.
![]() |
![]() |