![]() |
![]() |

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవడు, రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడు యువ రాజ్‌కుమార్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో సంచలన విజయాలు సాధించిన హొంబాళే ఫిలిమ్స్ అతడిని తొలిసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నది. ఈ మూవీని సంతోష్ ఆనంద్‌రామ్ డైరెక్ట్ చేయనున్నాడు. ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని హొంబాళే ఫిలిమ్స్ ప్రకటించింది. డార్క్ బ్యాగ్రౌండ్‌లో ఇంటెన్స్ లుక్స్‌తో కనిపిస్తోన్న యువ రాజ్‌కుమార్ పోస్టర్‌ను షేర్ చేసిన ఆ సంస్థ, "This is our journey from good to good. The legacy continues". అంటూ రాసుకొచ్చింది. ఈ మూవీ కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల కానున్నట్లు సమాచారం.
త్వరలోనే ఈ సినిమాకు పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడి కానున్నాయి. యువ బర్త్‌డే, డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి రెండూ ఏప్రిల్‌లోనే వస్తాయి. ఇదే నెలలో యువ పరిచయ సినిమా ప్రకటన రావడం గమనార్హం.
రాజ్‌కుమార్ కుటుంబంలో మూడో తరం హీరోగా యువ కన్నడ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. యువకు వినయ్ రాజ్‌కుమార్ అనే సోదరుడు ఉన్నాడు. నిజానికి గతంలో ఓ చారిత్రక చిత్రంతో హీరోగా యువ లాంచ్ కావాల్సింది. దానికి 'యువ రణధీర కంఠీరవ' అనే టైటిల్ కూడా పెట్టారు. దానికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే తెలీని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది.
ఇక డైరెక్టర్ సంతోష్ ఆనంద్‌రామ్ విషయానికి వస్తే.. గతేడాది పునీత్ రాజ్‌కుమార్ హీరోగా అతను రూపొందించిన 'యువరత్న' బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. దానికంటే ముందు 'మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి', 'రాజకుమార' లాంటి హిట్ మూవీస్‌ను అతను తీశాడు. ప్రస్తుతం జగ్గేష్ హీరోగా 'రాఘవేంద్ర స్టోర్స్' అనే కామెడీ ఎంటర్‌టైనర్‌ను తీస్తున్నాడు.

![]() |
![]() |