![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' మూవీ మరో మైలురాయిని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.600 కోట్ల షేర్ రాబట్టింది. ఇండియన్ సినిమా చరిత్రలో 600 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన రెండో సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. 830 కోట్లకు పైగా షేర్ తో మొదటి స్థానంలో 'బాహుబలి-2' ఉంది. ఈ రెండు సినిమాలకూ రాజమౌళినే దర్శకుడు కావడం విశేషం.
మార్చి 25 న విడుదలైన 'ఆర్ఆర్ఆర్' ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 రికార్డులు బద్దలు కొట్టి అత్యధిక కలెక్షన్ రాబట్టిన సినిమాగా నిలిచింది. 33 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 266.76 కోట్ల షేర్ (403.20 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా ఈ సినిమా నైజాంలో 110.71 కోట్లు, సీడెడ్ లో 50.57 కోట్లు, ఆంధ్రాలో 105.48 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఇక వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ 33 రోజుల్లో ఓవరాల్ గా 600.14 కోట్ల షేర్(1114 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇప్పటిదాకా కర్ణాటకలో 43.64 కోట్లు, తమిళనాడులో 38.08 కోట్లు, కేరళలో 10.48 కోట్లు, హిందీలో 131 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 9.13 కోట్లు, ఓవర్సీస్ లో 101.05 కోట్ల షేర్ రాబట్టి సత్తా చాటింది.
1100 కోట్ల గ్రాస్, 600 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ జోరుకి ఇక బ్రేకులు పడే టైం వచ్చింది. మొదటి 32 రోజులు వరల్డ్ వైడ్ గా ప్రతిరోజూ కోటికి పైగా షేర్ రాబట్టి సత్తా చాటిన ఆర్ఆర్ఆర్ 33వ రోజు మాత్రం 60 లక్షల షేర్ కి మాత్రమే పరిమితమైంది. ఇక ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల వేట దాదాపు ముగిసినట్లే. 29 న 'ఆచార్య' సినిమా విడుదల కానుంది. 29 నుంచి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పూర్తిగా పడిపోయే అవకాశముంది. మరోవైపు ఇప్పటికే నార్త్ లో, ఓవర్సీస్ లో 'కేజీఎఫ్-2' హవా కనిపిస్తోంది.
![]() |
![]() |