![]() |
![]() |

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా మల్టీస్టారర్ అంటే రామ్ చరణ్ గుర్తొస్తున్నాడు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య'లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు చరణ్ నెక్స్ట్ ఎవరితో మల్టీస్టారర్ చేస్తాడోనంటూ చర్చలు మొదలయ్యాయి.
పవన్ కళ్యాణ్, చరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ రానుంది అంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. గతంలో వీరి కాంబోలో మూవీ గురించి చర్చలు కూడా జరిగాయి కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ కాంబోలో మూవీ రావడం ఖాయం. ఈ విషయాన్ని స్వయంగా చరణ్ చెప్పడం విశేషం.
తాజాగా ఆచార్య ప్రమోషన్స్ లో పాల్గొన్న చరణ్.. పవన్ తో మల్టీస్టారర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే తమ కాంబోలో సినిమా గురించి కొన్ని ఐడియాస్ చర్చలు జరిగాయని, భవిష్యత్ లో తమ కాంబోలో కచ్చితంగా సినిమా వస్తుందని అన్నాడు. అంతేకాదు ఆ సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని చరణ్ తెలిపాడు.
![]() |
![]() |