![]() |
![]() |

సోలీలివ్ చానల్ అంటే జనానికి ఎక్కువగా గుర్తుకొచ్చేది క్రికెట్. అయితే ఆటలతో పాటు వినోదానికి కూడా ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ వస్తోంది ఈ చానల్. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కాకపోయినా, 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అయ్యాక, దేశంలోని విలక్షణమైన, ఆసక్తికరమైన ఉద్విగ్నభరితమైన సినిమాలు, సిరీస్‌లలో కొన్నింటిని ప్రసారం చేస్తూ వస్తోంది. అలా ఇప్పుడు సోనీలివ్‌లో మనం చూడదగ్గ మూవీస్, సిరీస్ ఏవో ఓ లుక్కేద్దాం...
1. తబ్బర్
జలంధర్‌లో ఒక రాజకీయనాయకుడి సోదరుడు తమ ఇంటి కాంపౌండ్‌లో హత్యకు గురవడంతో ఓంకార్ సింగ్ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంది? అనేది ప్రధానాంశం.
ప్రధాన తారాగణం: పవన్ మల్హోత్రా, సుప్రియా పాఠక్, గగన్ అరోరా, సాహిల్ మెహతా
క్రియేటర్, రైటర్: హర్మాన్ వదాలా
దర్శకత్వం: అజిత్‌పాల్ సింగ్
2. కానెక్కానే (మలయాళ చిత్రం)
ప్రధాన తారాగణం: టొవినో థామస్, ఐశ్వర్య లక్ష్మి, సూరజ్ వి.
రచన: బాబీ, సంజయ్
దర్శకత్వం: మను అశోకన్
3. భూతకాలమ్ (హారర్ ఫిల్మ్ - మలయాళం)
తల్లి చనిపోవడంతో డిప్రెషన్‌కు గురైన ఆశ, ఆమె కొడుకు విను అనుబంధం చుట్టూ నడిచే ఫిల్మ్ ఇది.
ప్రధాన తారాగణం: రేవతి, షేన్ నిగమ్, సైజు కురుప్
దర్శకత్వం: రాహుల్ సదాశివన్
4. శివరంజనియుమ్ ఇన్నుమ్ శిల పెంగలుమ్ (ఆంథాలజీ ఫిల్మ్ - మలయాళం)
మూడు దశాబ్దాల కాలంలో స్వేచ్ఛ కోసం తపించే ముగ్గురు స్త్రీల కథ ఇది.
తారాగణం: కాళేశ్వరి శ్రీనివాసన్, పార్వతి తిరువోత్తు, లక్ష్మీప్రియ చంద్రమౌళి
దర్శకత్వం: వసంత్ ఎస్. శాయి
5. భోంస్లే (హిందీ మూవీ)
తారాగణం: మనోజ్ బాజ్‌పేయీ, ఇప్షితా చక్రవర్తి, సంతోష్ జువేకర్
దర్శకత్వం: దేవశిష్ మఖీజా
6. కడఖ్ (హిందీ ఫిల్మ్)
ఒక జంట ఇచ్చిన బర్త్‌డే పార్టీలో శవం ప్రత్యక్షమవడంతో ఏర్పడిన పరిస్థితులు ఇందులోని ప్రధానాంశం.
తారాగణం: రణవీర్ షోరే, మాన్సీ ముల్తాని, రజత్ కపూర్, కల్కి కొచ్చిన్, చంద్రచూర్ సింగ్
దర్శకత్వం: రజత్‌కుమార్
7. కార్ఖానిసాంచి వారి (డార్క్ కామెడీ)
తారాగణం: మోహన్ అగాషే, ప్రదీప్ జోషి, అజిత్ అభయంకర్, గీతాంజలి కులకర్ణి
దర్శకత్వం: మంగేశ్ జోషి
8. గుల్లక్ (సిరీస్)
తారాగణం: గీతాంజలి కులకర్ణి, జమీల్ ఖాన్, వైభవ్ రాజ్ గుప్తా, హర్ష్ మాయర్
దర్శకత్వం: పలష్ వాస్వాని
9. మానాడు (తమిళ్ మూవీ)
ఒక పొలిటికల్ మర్డర్ ప్లాట్‌లో ఇరుక్కుపోయిన ఓ సామాన్యుడు ఏం చేశాడనేది ప్రధానాంశం.
తారాగణం: శింబు, కల్యాణి ప్రియదర్శన్, యస్.జె. సూర్య
దర్శకత్వం: వెంకట్ ప్రభు
10. క్లాప్ (తెలుగు ఫిల్మ్)
భాగ్యలక్ష్మి అనే ఓ పేదింటి అమ్మాయిని నేషనల్ అథ్లెటిక్స్‌లో పాల్గొనేలా చేసే క్రమంలో విష్ణు అనే మాజీ అథ్లెట్ ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడనేది ప్రధానాంశం.
తారాగణం: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, క్రిష కురుప్, నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మాజీ
దర్శకత్వం: పృథివి ఆదిత్య
![]() |
![]() |